'స్కైలాబ్' నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్!

01-12-2021 Wed 18:04 | Entertainment
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • ప్రధాన పాత్రల్లో సత్యదేవ్ .. నిత్యామీనన్ 
  • ఈ నెల 4న థియేటర్లలో విడుదల
సత్యదేవ్ - నిత్యామీనన్ జంటగా 'స్కైలాబ్' సినిమా రూపొందింది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను, పృథ్వీ పిన్నమరాజు నిర్మించాడు. నిర్మాణ భాగస్వామిగా నిత్యా మీనన్ వ్యవహరించింది. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

చాలా కాలం క్రితం స్కైలాబ్ పడుతుందనీ ..  ఎవరూ బ్రతకరనే ప్రచారం గ్రామాల్లో బలంగా జరిగింది. దాంతో ఎవరికి ఇష్టమైనవి వారు చేసుకుని తిన్నారు. ఏ క్షణంలో ఎక్కడ స్కైలాబ్ పడుతుందోనని ఆకాశం వైపు చూస్తూ భయంతో బ్రతికారు. ఆ సంఘటననే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది.

టీవీలకు .. మొబైల్  ఫోన్లకు  దూరంగా గడిచిన ఆ కాలానికి సంబంధించిన వాతావరణాన్ని బాగానే ప్రతిబింబించారు. సినిమాలో కావలసినంత కామెడీ ఉంటుందనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. తులసి .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన  పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు.
SathyadevNithya MenenRahul RamakrishnaSkylab Movie

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more